AP: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద టీడీపీ నేత ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును ఎమ్మెల్యే శ్రావణి తల్లి నీలావతి రూ.5 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు.