వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అభ్యంతరకర పోస్ట్‌ల కేసులో హైకోర్టులో ఆయన ఊరట లభించింది. కానీ, ఇప్పటికే వ్యూహం సినిమాలో పలువురు టీడీపీ నేతల ఫోటోలు ఉపయోగించి వ్యంగంగా చూపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ కేసు విచారణకి హాజరు కావడం లేదు. అయితే, ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మరోసారి రామ్ గోపాల్ వర్మకి కూటమి సర్కారు షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాని ఏపీలో ప్రసారం చెయ్యడానికి ఏపీ ఫైబర్ నెట్‌కు విక్రయించగా.. ఈ క్రమంలో సినిమాకి వ్యూస్ లేకపోయినా రూ. 1.15 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వ్యూహం చిత్ర యూనిట్ ఈ సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 15 రోజుల్లో ఈ డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది