యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌కు చెందిన ఆకాష్ సింగ్, లక్నో నివాసి సోనాలితో డిసెంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్‌కు గోవాకు వెళ్లారు. వారు డిసెంబర్ 21న హనీమూన్ ముగించుకుని కాన్పూర్‌కు వెళ్లి, తన భార్యను ఆమె తల్లి వద్ద వదిలి ఒంటరిగా ఇంటికి వచ్చాడు.
శనివారం సాయంత్రం ఆకాశ్ స్నేహితుడు ఇంటికొచ్చేసరికి.. ఆకాశ్ మృతిచెంది ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుండెపోటు లేదా మరేదైనా వ్యాధితో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.