మాజీ సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్‌కు సంబంధించి చిన్న పని కూడా చేయలేదన్నారు.
వైసీపీ గత ఐదేళ్లలో ఇరిగేషన్ శాఖకు రూ.32 వేల కోట్లు కేటాయించి రూ. 19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇరిగేషన్ శాఖను గాఢిలో పెట్టడానికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.