కారంపూడి మండల కేంద్రంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు.
మండల పరిధిలో 22 మంది లబ్ధిదారులకు గాను రూ. 37, 51, 172 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు.