తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా నిర్వహించిన ‘తెలుగులో న్యాయపాలన’ సదస్సులో జస్టిస్ కె.మన్మథరావు మాట్లాడారు.
‘‘తెలుగులో తీర్పు రాశాను అనే విషయంలో ఆనందంగా ఉంది. న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్లినా మాతృభాషలోనే మాట్లాడాను. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు అర్థమవుతుంది’’అని ఆయన అన్నారు.