కావలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రామిరెడ్డి నివాసంలో వైసీపీ నాయకులు బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.