వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీకి గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. గుడివాడలోని టీడీపీ కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి ఘటనలకు కీలక సూత్రధారి కాళీ అని పోలీసులు గుర్తించారు. 2022 డిసెంబర్ 25వ తేదీ రాత్రి కాళీ తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావులపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశాడు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది వైసీపీ కార్యకర్తలు రిమాండ్ లో ఉన్నారు. అసోంలో ఉన్న కాళీని పోలీసు బృందాలు అరెస్ట్ చేసి గుడివాడకు తీసుకొచ్చాయి. వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం కాళీని కోర్టులో ప్రవేశపెట్టగా... ఈ నెల 10వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. వెంటనే కాళీని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.