తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను YCP అధినేత జగన్ పరామర్శించనున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రుయా ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి తొక్కిసలాటకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.