AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం జరిగిందన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలే ఈ ఘటనకు ప్రధాన కారణమని అంబటి ఆరోపించారు. అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారన్నారు. గతంలో జగన్ కొండ మీదకు వస్తానంటే పెద్ద బోర్డులు పెట్టారు.. ఇప్పుడు కనీసం భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.