విదేశీ భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. మూడు వారాల జర్నీ ఉంటుంది. దేశంలోని పలు సంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను ఆ రైలు చుట్టివస్తుంది.