ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13 నుంచి మహాకుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇప్పటికే పలువురు సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు.
వారిలో హిమాచల్ ప్రదేశ్‌లోని చంపా నుంచి వచ్చిన తొమ్మిదేళ్ల గోపాల్ గిరి మహారాజ్ అతిపిన్న వయస్కుడైన నాగ సన్యాసిగా నిలిచారు. ప్రస్తుత శీతాకాలంలో గడ్డకట్టే చలి మధ్య శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా, కేవలం బూడిద పూసుకుని తపస్సు కొనసాగిస్తున్నారు.