మిరప సాగుకు నారు పెంచడానికి నేలకు కొంచం ఎత్తులో మట్టిని బెడ్లుగా చేసుకోవాలి. నాలుగు మూలాలు సమన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమడిలో విత్తనాల మధ్య దూరం ఒక్క అంగుళం దూరం ఉండేలా వేసుకోవాలి. సేల్టర్‌లో నారు వెయ్యనివారు నారు మొక్కలకి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులగా పైన వేసుకోవాలి. మొక్క వయస్సు 35-40 రోజుల మధ్యలో మొక్కలను నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.