చిత్తూరు నగరంలోని గురునగర్ కాలనీలో గల ఆర్కే మోడల్ స్కూల్ లో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో అలరించారు. అలాగే పల్లెటూరి వాతావరణం మరిపించేలా రంగ వల్లులు, భోగి మంటలు వేసి కోలాటలాడారు. అలాగే పొంగల్లు వండారు రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. నత్య గీతాలతో అలరించారు.