ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుక్మా, బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 09, 2025, 03:34 PM

ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య గురువారం మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు దళాల భద్రతా సిబ్బందితో కూడిన ఒక జాయింట్ టీమ్ యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపడుతోందని, ఈ క్రమంలో గురువారం ఉదయం కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. డీఆర్ఎస్ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా సిబ్బంది ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టారని వివరించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, తదుపరి సమాచారం అందాల్సి ఉందని అధికారి పేర్కొన్నారు.కాగా, నవంబర్ నెల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నక్సల్స్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే, ఈ ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా మావోయిస్టులు ఇటీవల భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2026 నాటికి నక్సల్స్ రహిత్ దేశాన్ని ఆవిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది. ఈ క్రమంలో యాంటీ నక్సలైట్ ఆపరేషన్లు విస్తృతంగా జరుగుతున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com