కేంద్ర ప్రభుత్వ కరువు బృందంతో సమావేశమై APలో కరువు పరిస్థితులను రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ RP సిసోడియా వివరించారు. APలో ఖరీఫ్-2024 కరువు పరిస్థితులపై కేంద్రప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
ఖరీఫ్ కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77కోట్లు సాయం చేయాలని కోరారు.