రాష్ట్రం ఎప్పుడూ ఐటీకి కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్ర డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
‘‘విశాఖకు బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో వస్తే నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ, ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ నగరాన్ని ప్రపంచానికే గర్వ కారణంగా నిలిచేలా తీర్చిదిద్దుతాం’’ అని తెలిపారు.