విజయనగరంలో రోటరీ సెంట్రల్ కైలాష్ భూమి (స్మశాన వాటిక)లో గ్యాస్ బర్నర్ షెడ్డు నిర్మాణం కోసం వాసు రాజు గురువారం రోటరీ కార్యాలయంలో 2 లక్షల రూపాయల చెక్ ను విరాళంగా అందజేశారు. ఈ చెక్ ను కైలాష్ భూమి ఛైర్మన్ మూర్తి, కోశాధికారి శంకర్ రెడ్డి మరియు సభ్యుడు పూసర్ల మారుతి అందుకున్నారు. ఈ సందర్భంగా వాసు రాజు కుటుంబానికి వారు ధన్యవాదాలు తెలిపారు.