ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు మహాద్భుతం చేశారు. గుండె జబ్బుతో అచేతనంగా ఉన్న ఓ వ్యక్తి(19)కి మరో వ్యక్తి (25) గుండెను విజయవంతంగా అమర్చారు.
ఈ ప్రక్రియ 2025,జనవరి 8 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి, 9వ తేదీ ఉదయం 3 గంటల ప్రాంతంలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.