తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు.
బాధితులతో మాట్లాడి.. ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కాగా నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు.