విజయవాడ పరిధిలోని కానూరు హరిజనవాడకు వెళ్లే మెయిన్ రోడ్డు మొదట్లో అంబేద్కర్ , బాబుజగజీవన్ రావ్ , వైయస్సార్ విగ్రహాల ఉన్నాయి . హరిజనవాడకు (మాల,మాదిగలు) వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇప్పుడు కొత్తగా బాబుజగజ్జీవన్ రావు కాలనీగా బోర్డు ఏర్పాటు చేయుచూ మూడు విగ్రహాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తామని మాలలకు ఇటు దారి లేదు అని మాదిగ సోదరులు చెప్పడంతో అక్కడ మాల మాదిగలకు అగాధం ఏర్పడింది.
దీనితో అక్కడున్న మాల సోదరులు కమిషనర్ కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది . అంబేద్కర్ విగ్రహాన్ని నిజంగా ఎవరైనా తొలగించే తరుణం ఆసన్నమైతే ఎదుర్కోవడానికి అంబేద్కర్ వాదులంతా అన్నదమ్ముల వలె కలిసి మెలసి ఉంటున్న మాల - మాదిగ కులాల మధ్య కుల చిచ్చు రగిల్చి రాజకీయ ప్రయోజనం కోసం కొందరు నాయకులు చేసే ఈ దుర్మార్గాన్ని కలిసి ఎదుర్కోవాలని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అక్కడి మాలలు కోరుకుంటున్నారు.