ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అనేక మంది సాధువులు, బాబాలు, సన్యాసులు, సాధ్విలు పాల్గొంటున్నారు. అయితే ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుండగా.. ఇప్పుడు ఓ 30 ఏళ్ల సాధ్వి నెట్టింటిని షేక్ చేస్తోంది. చిన్న వయసులోని సాధ్విగా మారిన ఈమె.. పసుపు రంగు దుస్తులు ధరించి మహా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎంతో అందంగా ఉన్న ఈ సాధ్వి ఎవరో తెలుసుకునేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ 30 అమ్మాయి ఎవరు, ఎప్పుడు సాధ్విగా మారిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ 30 ఏళ్ల సాధ్వి పేరు హర్ష రిచారియా. ఉత్తారఖండ్‌కు చెందిన ఈమెకు యాంకర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఒక్క ఇన్ స్టాగ్రామ్‌లోనే ఈమెకు 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యాంకర్‌గా పని చేస్తున్న ఈమె అనేక ఈవెంట్లకు కూడా హాజరవుతూ ఉంటుంది. వివాహాలు, పలు ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరైంది.
అయితే చాలా అందంగా ఉన్న హర్ష రిచారియా.. పసుపు పచ్చ బట్టలు ధరించి నుదిటిన పెద్ద బొట్టుతో మరింత మెరిసిపోయింది. అయితే ఓ యాంకర్ ఈమెను పలు ప్రశ్నలు అడగ్గా.. రథంలో కూర్చుని సమాధానాలు చెప్పింది. తనకు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు అని, ఉత్తారఖండ్‌కు చెందిన సాధ్విగా చెప్పుకుంది. అయితే రెండేళ్ల నుంచే తాను ఆథ్యాత్మికతపై దృష్టి సారించినట్లు కూడా వివరించింది. అద్భుతమైన అందం కల్గిన ఈమె సాధ్వి రూపంలో కనిపించే సరికి ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.
ఈక్రమంలోనే ఆమె ఎవరో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ చూసి ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ప్రమోషన్ల కోసమే ఈమె ఈ స్టంట్ చేసిందంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈమెకు అండగా నిలుస్తున్నారు. ఆమె గత రెండు సంవత్సరాల నుంచి ఆథ్యాత్మిక బాటలో నడుస్తోందని.. ఆమె పెట్టిన పోస్టులు గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు. అనేక మంది ఆథ్యాత్మిక గురువులను కలిసిన ఆమె.. ఆచార్య మహామండలేశ్వర్ శిష్యురాలు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హర్ష రిచారియా శాంతియుత జీవనం కోసమే సన్యాస మార్గాన్ని ఎంచుకున్నట్లు అంతకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లోని ఆధ్యాత్మిక గురువు వ్యాసానంద గిరి మహారాజ్‌కు సత్యారం చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.