ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో సాధారణ భక్తుల కంటే ఎక్కువగా సాధువులు, బాబాలు దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా లక్షలాది మంది సన్యాసులు, నాగ సాధువులు, బాబాలు అక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత.. పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి.. అక్కడకు వచ్చే సామాన్య భక్తులకు అనేక విషయాల గురించి వివరిస్తుంటారు. ఆథ్యాత్మికత వెల్లివిరిసే ఆ పవిత్ర స్థానంలో.. ఓ నకిలీ బాబా రచ్చ చేశాడు. ముఖ్యంగా ఆ మహా శివుడి భార్య పేరు సీత అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. మరి ఆ ఫేక్ బాబాను భక్తులు ఏం చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఓ సాధువు భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులు... అతడికి డబ్బు ఇస్తూ దండం పెట్టుకుంటున్నారు. అందరిలాగే ఆ స్వామీజికి డబ్బులు దానం చేసిన ఓ భక్తుడు.. ఆయన వద్ద జ్ఞానం పొందాలనుకున్నాడు. ఈక్రంలోనే తనకు తెలియని కొన్ని అంశాల గురించి ప్రశ్నించాడు. అయితే ఆ సాధువు మాత్రం భక్తుడు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం తెలియదని చెప్పాడు.దీంతో అతడిపై అనుమానం వచ్చిన అతడు.. గాయత్రీ మంత్రమైనా చెప్పమని భక్తుడు అడిగాడు.
కానీ ఆ సాధువు మాత్రం తనకు రాదని వివరించాడు. దీంతో భక్తులు.. చిన్న పిల్లలను అడిగినా ఈ గాయత్రి మంత్రం చెప్తారు.. మీకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. నాకు చదవడం రాయడం రాదని వివరించే ప్రయత్నం చేశాడా సన్యాసి. ఇదంతా చూస్తున్న మరికొంత మంది భక్తులు కూడా ఆయన వద్దకు వచ్చారు. ఈక్రమంలోనే ఓ భక్తుడు.. శివుడి భార్య పేరు ఏంటో చెప్పండి అంటూ అడిగారు. దీనికి వెంటనే ఆ సాధువు.. సీత అని సమాధానం చెప్పాడు. దీంతో భక్తులు అంతా షాక్ అయ్యారు.
శ్రీరామ చంద్రుడి భార్య సీతను.. శివుడి భార్యగా చెప్పడం చూసి అతడు నకిలీ బాబా అని గుర్తించారు. ఆపై వెంటనే అతడిని స్థానికంగా ఉన్న పోలీసులకు అప్పగించారు. అయితే ఈ నకిలీ బాబా.. నిజమైన సాధువుల మాదిరిగానే సాధకాషాయ బట్టలు ధరించి.. త్రికుండంలో ఉన్న బొట్టు పెట్టుకున్నారు. అది చూసే అంతా మోసపోయారు. కానీ చిన్న ప్రశ్న అడిగిన వెంటనే అతడి బండారం అంతా బయట పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. డబ్బుల కోసం అనేక మంది ఇలా బాబాలు, సాధువుల రూపంలో మారు వేషంలో వస్తారని.. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి నకిలీ బాబాలకు కఠిన శిక్షలు వేస్తే తప్ప మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయరంటూ మరికొంత మంది కామెంట్ల రూపంలో తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు.