పశ్చిమ బెంగాల్‌లో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మిడ్నాపూర్‌లోని దిఘా నది సమీపంలో శనివారం ఉదయం ఓ పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన అడెలైన్ బోటు సిబ్బంది.. మునిగిపోయిన బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులను క్షేమంగా రక్షించి, ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.