వరుస ఎన్కౌంటర్లతో చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నెత్తురోడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సుక్మా- బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి.. మావోయిస్టులకు సంబంధించిన భారీ బంకర్‌ను గుర్తించాయి. పోలీసులు టార్గెట్‌గా దాడులు చేసేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులు బాంబుల తయారీకి గాజు సీసాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. కీకారారణ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి బాంబుల తయారీ చేస్తున్న మావోల సాంకేతిక పరిజ్ఞానాన్ని..పనితనం ఔరా అనుకున్నారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా దాడులు చేసేందుకు మావోయిస్టులు రకరకాల బాంబులను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు.కాగా చత్తీస్ గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కగార్(2026) చేపట్టిన భద్రతా బలగాలు అబూజ్ మడ్ అడవుల్లో మావోల ఏరివేతకు భారీ కార్యాచరణ ఆపరేషన చేపట్టబోతున్నట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సహా ఇతర కమిటీలన్ని చత్తీస్ గఢ్ దండకారణ్యం కేంద్రంగా పనిచేస్తుండటం..పీఎల్ జీఏ దళాలు కూడా అక్కడే ఉండటంతో భద్రత బలగాల భారీ అపరేషన్ మావోయిస్టులకు సంకటంగా మారింది.