ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని హుడ్కో నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంప్రదింపులతో హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయని ఆయన స్పష్టం చేశారు. గతేడాది మే, జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో గత ఐదేళ్లుగా.. అంటే 2019 నుంచి 2024 మే మాసం వరకు వైసీపీ పాలనలో రాష్ట్ర రాజధాని ఏదో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది.