అరిలోవాలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో అమ్మాయిలను హింసించి, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తారా అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల సదన్‌లో మత్తు మందు ఇవ్వడం దుర్మార్గమని, ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండు చేశారు. గురువారం వరుదు కళ్యాణి బాలికల సదన్ ఘటనపై స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.