సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించే అవకాశం వుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్ లలో గృహ ప్రవేశాల కార్యక్రమానికి తణుకు నుంచే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. అలాగే పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సీఎం చేతుల మీదుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షెడ్యూలు అధికారికంగా ఖరారు కావాల్సి వుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తణుకు, తేతలి, మండపాక పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్‌లలో హౌసింగ్ లే అవుట్లను, తణుకు ఎస్‌ఎన్‌విఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలీపాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయూం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట ఏఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కతీబ్ కౌశల్‌బానో, హౌసింగ్ పీడీ వై.హరనాధ్, తహశీల్దార్ దండు అశోక్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.