విజయనగరం జిల్లాలో మరిడిమాంబ అమ్మవారి తీర్ధమహోత్సవం ఆది, సోమ ,మంగళవారాల్లో నిర్వ హించనున్నట్లు సర్పంచ్ బల్లంకి వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్లంకి, బానాది, ఎం.సింగవరం, నీలకంఠరాజపురం ,పెదగుడిపాల, భర్తవానిపాలెం, చినగుడిపాల, బీటీకేరాజపురం, తదితర తొమ్మిది గ్రామాల ప్రజలు మరిడిమాంబ అమ్మవారి తీర్ధమహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు బండ్ల వేషాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌లు,రేళారే రేలా కార్యక్రమాలు, గయోపాఖ్యానం యుద్ద సీను, 27న బుర్రకథ, విశాఖనాయుడు ఈవెంట్స్ వారితో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 28న ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించనున్నారు.