ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సెక్టార్ 7లో నిర్వహించిన డ్రోన్ షో.. భక్త కోటిని పులకించిపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ డ్రోన్ షోలో వందలాది డ్రోన్లు ఆకాశంలో వివిధ చిత్రాలు, దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి. దేవతలు అమృత కలశాన్ని సేవిస్తున్నట్లు డ్రోన్ షోలో చూపించారు. అలాగే సముద్ర మథనానికి సంబంధించిన దివ్య శకటం ఎంతో ఆకర్షించేలా చేసింది. ఆకాశంలో మహా కుంభమేళా చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగో చూపరులను కట్టిపడేసింది. గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న సాధువు, శంఖం ఊదుతున్న సన్యాసి చిత్రాలు ఆసక్తికరంగా మారాయి. ఇక యూపీ అసెంబ్లీ భవనంపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లు ఉన్న డ్రోన్ షో హైలైట్‌గా నిలిచింది.