జగన్ నాయకుడిగా ఓడిపోయాడు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికు ఏం చెప్పకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేయరని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డిపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన పిల్లల మీద ఇష్టం వచ్చినట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారని చెప్పారు. వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్‌ను వీసారెడ్డి వంటి వారే వదిలి వేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని చెప్పారు. జగన్ నాయకుడిగా ఓడిపోయాడు.. విశ్వాసనీయతను కోల్పోయారని వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు.