రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ట్రైబుల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పోస్టర్‌ను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం పాలకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబుల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కె.అక్కులప్పనాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణునాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.భగవాన్ తదితరులు ఉన్నారు.సీతంపేట రూరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో రాజమండ్రిలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాల పోస్టర్‌ను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర తదితరులు పాల్గొన్నారు.