ఒక కేసు విచారణలో భాగంగా విశాఖ కోర్టుకు హాజరయ్యేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం నగరానికి వస్తున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వెనుక ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్లి బస చేస్తారు. 27వ తేదీ ఉదయం కోర్టుకు హాజరవుతారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ బయలుదేరి వెళతారు.