వజ్రపుకొత్తూరు పరిధిలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన పూండిలో దొంగలు హల్ చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి బంగారం దుకా ణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో ఏడుగురు పాల్గొ న్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసులు, బాధి తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దున్న రవికి చెందిన బంగారు దుకాణం తలుపులు పగుల గొట్టి బంగారం, వెండి వస్తువులు అపహరించారు. అలాగే ఆర్‌కే జూయలర్స్ తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే తలుపులు ఊడకపోవడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. గురవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల సమయంలో ఏడుగురు దొంగలు పెద్ద కట్టర్లు, ఇనపరాడ్లతో దున్న రవికి చెందిన బంగారు షాపు పగులగొట్టినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. 9.8 కేజీల వెండి, 9 తులాల బంగారం చోరీ చేశారని ఎస్‌ఐ బి.నిహార్ తెలిపారు. దొంగిలించిన సొత్తును సమీపంలోని చెరువుగట్టుపై ఆగి ఆభరణాలను మూటగట్టి వాటి కవర్లు, బాక్సులను అక్కడ వదిలి వెళ్లినట్లు గుర్తించారు. యథావిధిగా శుక్రవారం ఉదయం దుకాణం తెరిచేందుకు రవి వెళ్లగా తలుపులు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ నిహార్ సిబ్బందితో కలిసి ఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అలాగే క్లూస్ టీం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరిం చారు. దుకాణం పైభాగంలోనే యజమాని రవి నివ సిస్తున్నాడు. దీంతో వస్తువులన్నీ దుకాణంలోనే ఉంటాయని ఆయన తెలిపారు. అయితే క్లూస్‌టీం తనిఖీలో కొంత బంగారం, వెండి షాపులోనే ఉన్నట్లు గుర్తించి వాటిని యాజమానికి అప్పగించారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.