రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి జాప్యం చేయొద్దని మా ర్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డైరెక్టర్ రామ కృష్ణనాయుడు అన్నారు. అరసవల్లి నగరంలోని మార్క్‌ఫెడ్ కార్యాలయాన్ని శుక్రవారం వారు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల సరఫరా, స్టాక్ వివరాలను డీఎంను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మార్క్‌ఫెడ్‌కు సొంత భవనం లేదని, భవన నిర్మా ణానికి అవసరమైన స్థలం, నూతన భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు గురించి అధికారులతో చర్చించి వీలైనంత త్వరలో సొంత భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ రామకృష్ణనాయుడు, మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.