ఒంగోలు నగరంలో పారిశుధ్యం మెరుగు కోసం అధికారులు తీసుకున్న నిర్ణయాలను కొందరు పెడచెవిన పెడుతున్నారు. పారిశుధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. అందులో భాగంగా 4వ డివిజన్ శానిటరీ కంకణాల ఆంజనేయులు పనితీరుపై అటు ప్రజలే కాకుండా, ఇటు డివిజన్‌లోని కార్మికులు సైతం అనేకసార్లు ఫిర్యాదు చేశారు. మహిళ కార్మికుల పట్ల అసభ్య పదజాలం వాడుతూ మరి కొందరి సిబ్బందిపై దూకుడుగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణల పై కమిషనర్ ఇప్పటికే నాలుగుసార్లు మెమో జారీ చేసినా ఆ ఇన్‌స్పెక్టర్ తీరు మారకపోవడతో ఆంజనేయులను బాధ్యతల నుంచి తొలగించి, గుత్తికొండవారిపాలెం వద్ద డంపింగ్ యార్డు వద్దకు బదిలీ చేశారు. అక్కడకు వచ్చే వహనాలను నమోదు చేసుకోవడంతోపాటు డపింగ్ యార్డులో పనులు పర్యవేక్షించాలని కా ర్పొరేషన్ కమిషనర్ ఉత్వర్వులు ఇచ్చారు. అయితే కమిషనర్ ఆదేశాలను సైతం లెక్కచేయని ఆంజనేయులు యధావిధిగా డివిజన్‌లో పారిశుద్య పనులు పర్యవేక్షించడం, మస్టర్ పాయింట్ లకు వెళ్ళి తనపై ఫిర్యాదులు చేసిన వారిని బె దిరించడం పట్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఇన్‌స్పెక్టర్ తమకొద్దంటూ శానిటరీ అధికారుల వద్ద వాపోతున్నారు. ఇదిలా ఉం డగా, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు డి.వెంకటేశ్వ ర్లు, యు.శ్రీరామ్‌లను ఇన్‌స్పెక్టర్ బాధ్యతల నుంచి తొలగించి, వారిని పారిశుధ్య పనుల ప ర్యవేక్షణకు మేస్త్రీలుగా నియమించారు. అయితే వారు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. దీంతో వారి స్థానంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా నియమితులైన శానిటరీ సెక్రటరీలు డివిజన్‌ల లో వెళ్ళినా పాత ఇన్‌స్పెక్టర్‌లు బాధ్యతలను తప్పుకోకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కమిషనర్ ఆదేశాలను సై తం లెక్కచేయకపోవడంపై కార్పొరేషన్‌లో చ ర్చనీయాంశమైంది.