కన్యాశుల్కంలో వేశ్య మధురవాణి, అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్ కూడా చివరి దశలో తాము మారిపోయాము కనికరించండి అన్నట్లుంది ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. జగన్ అండతో తీవ్రమైన అవినీతి, అరాచకాలకు పాల్పడి సంపాదించిన సొమ్మునంతా బాధితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. కేసుల నుంచి రక్షణ కోసమే జగన్ రెడ్డి సలహాతో సాయిరెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని కనపర్తి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.