భవిష్యత్ అంతా గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం భవిష్యత్‌లో బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. ఏపీలో ఇప్పుడు 10 లక్షల మంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతి మీటింగ్‌లో నేను, లోకేష్ ప్రతీ వేదికపై ఏపీని ప్రమోట్ చేశాం. అప్పట్లో మేము హైటెక్ సిటీ స్టార్ట్ చేశాం. 1995లో ఐటీ, 2025లో ఏఐ యుగం అని నేను అందుకే చెప్పాను. నువ్వు ఉద్యోగం అడగడం కాదు... నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలి. మొన్న నేను జూరిచ్ వెళ్ళినప్పుడు చాలా మంది 500 మంది తెలుగు వాళ్ళు వచ్చారు. అందులో చాలా మంది కంపెనీలు పెట్టారు. 100 దేశాల్లో తెలుగువాళ్ళు ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో మన వాళ్ళు.. అన్ని దేశాలకు వెళతారు. సీఐఐతో కలిసి సింగపూరులోని ఐఎమ్‌బీని కలుపుకొని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అమరావతిలోనే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. మిగతా దేశాల్లో చాప్టర్‌లు ఉంటాయి. దావోస్ అంటే అందరు ఎన్ని ఎంవోయూలు చేశారని అంటారు.. అది క్రైటీరియా కాదు. దావోస్‌లో నాలుగు రోజులు ప్రపంచం మొత్తం వస్తుంది. అక్కడ మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి... అక్కడ అనేక మంది సీఈఓ లు, కంపెనీల అధిపతులు వచ్చి కలిశారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.