అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో వరుసగా నాటౌట్‌గా నిలుస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో (107*, 120*, 19*, 72*) ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. ఇలా టీ20 క్రికెట్లో నాటౌట్‌గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు.