వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శని దేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతారు. శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది.శని దేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాలను చూపుతుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు.
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం
ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. ఉదయం ఏడు గంటల 52 నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని దేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభరాశి వారికి వివిధ రకాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచరిస్తూ వృషభ రాశిలో పదకొండవ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయం వృషభరాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. జీవితంలోని సమస్యలన్నీ పరిష్కారమై కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారవేత్తలు విజయాలు సాధిస్తారు.
మిధున రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా మిధునరాశి జాతకులకు కలిసి వస్తుంది. శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ మిధునరాశిలోని పదవ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా మిధున రాశి వారి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. శని అనుగ్రహంతో ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు ఉంటుంది.
తులారాశి
శని తులారాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. తులా రాశి వారికి కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. తులారాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.