ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో, ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే "పబ్లిక్ గ్రీవేన్స్ రిడ్రసల్ సిస్టం"ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం ప్రకటించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా గ్రీవెన్స్ తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.