రిలయన్స్ డిజిటల్ ఈ-కామర్ సంస్థ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. 2022లో విడుదలైన ఈ యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్, ఇప్పుడు భారీ తగ్గింపుతో కేవలం రూ.48,000కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.54,900కాగా, నేరుగా రూ.6,500 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫరే కాదు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఈ డిస్కౌంట్లతో, ఐఫోన్ 14 ధర ఏకంగా రూ.47,400కు పడిపోతుంది. ఒకవేళ మీ దగ్గర HSBC క్రెడిట్ కార్డ్ ఉంటే, మరో 5% డిస్కౌంట్ (గరిష్టంగా రూ.2,000 వరకు) అందుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 46,400కే సొంతం చేసుకోవచ్చు. అంటే, అసలు ధరతో పోలిస్తే మీరు ఏకంగా రూ.8,500 ఆదా చేసుకోవచ్చు అన్నమాట.