దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆతిశీ(ఆప్), రమేష్ బిధూరీ(బీజేపీ), అల్కా లంబా(కాంగ్రెస్), జంగ్‌పురా నియోజకవర్గం నుంచి మనీశ్ సిసోడియా(ఆప్), సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా(బీజేపీ), ఫర్హాద్ సురి(కాంగ్రెస్) బరిలోకి దిగారు.