ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వైట్‌హౌ్‌సలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని సమావేశమై చర్చలు జరుపుతారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసిన వెంటనే అమెరికాలో పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం చేశాక మోదీ 27న ఆయనకు ఫోన్ చేసి అభినందించారు.