బడ్జెట్లో భారత అంతరిక్ష పరిశోధనలకు రూ.13,415 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ తెలిపారు. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నారాయణన్ స్వగ్రామం కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకాట్టువిలై గ్రామస్తులు సోమవారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణన్ విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవలే వందో రాకెట్ జీఎ్సఎల్వీ ఎఫ్-15ను విజయవంతంగా ప్రయోగించామని, ఇస్రో ఉద్యోగుల సమష్టి కృషికి ఈ విజయం నిదర్శనమని కొనియాడారు.