మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఓ చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. కునో నేషనల్ పార్కులోని వీరా అనే చిరుతకు మంగళవారం రెండు పిల్లలు పుట్టాయి. దీంతో పార్కులో చిరుతల సంఖ్య 26కి పెరిగింది. వాటిలో 12 పెద్ద చిరుతలు, 14 పిల్లలు ఉన్నాయి. కాగా, చిరుత కూనలు జన్మించడంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. చిరుత కూనల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.