అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేస్తున్న తమిళ యువకుడు.. అమెరికా యువతి ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం తిరువణ్ణామలై జిల్లా సెంజిలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. జిల్లాలోని చెయ్యారు తాలూకా అనకావూరు గ్రామానికి చెందిన భాస్కరన్ పెద్ద కుమారుడు అవినాష్ నాసాలో పని చేస్తున్నారు.అతడు అమెరికాకు చెందిన కేథరీన్ ఓసేవి అనే యువతిని ప్రేమించగా, రెండు కుటుంబ పెద్దల అనుమతితో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో తమ కులదైవమైన సెంజిలోని ఏకాంబరేశ్వరాలయంలో వీరి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.