రేపు (ఫిబ్రవరి 5న) ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటి కోసం 1.55 కోట్ల మంది ఓటర్లు తమ గౌరవప్రదమైన ఓటును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది.