పన్నుల సొమ్ములో కేంద్రం తమకు న్యాయమైన వాటా ఇవ్వడం లేదని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సూచన చేశారు. ఆ రాష్ట్రాలు 16వ ఆర్థిక కమిషన్‌కు తమ అభ్యంతరాలను తెలియజేయాలని సలహా ఇచ్చారు. కమిషన్ సిఫారసుల ప్రకారమే నిధుల పంపిణీ జరుగుతుందని, రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోబోమని తెలిపారు.