పిడుగురాళ్ల పట్టణంలోకి ద్విచక్ర వాహనదారుడు రావాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిడుగురాళ్ల సీఐ వెంకటరావు అన్నారు. మంగళవారం సాయంత్రం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో ప్రతి ద్విచక్ర వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలా ధరిస్తేనే పిడుగురాళ్ల పట్టణంలోకి ప్రవేశం ఉంటుందని లేకపోతే వాహనాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.